Kavitha : కవితకు మరోసారి ఈడీ, సీబీఐ బిగ్ షాక్!! మళ్లీ జైలుకే వెళ్లిన ఎమ్మెల్సీ..
Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాంలో మార్చి 16 నుంచి తీహార్ జైలులో జీవితం గడుపుతున్న ఎమ్మెల్సీ కవితకు కోర్టులో మరో మారు తీవ్ర నిరాశ ఎదురైంది. నేటితో ఆమె జ్యుడీషియల్ రిమాండ్ ముగియడంతో వర్చువల్ గా ఈడీ అధికారులు కవితను కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో ఢిల్లీలోని హౌస్ అవెన్యూ కోర్టు కవితకు జ్యూడిషియల్ రిమాండ్ ను పొడిగించి షాక్ ఇచ్చింది.
మళ్లీ జైలుకే..
ఇప్పటికే ఆమె పెట్టుకున్న బెయిల్ అభ్యర్థనను తిరస్కరించిన ధర్మాసనం నేడు మళ్లీ జ్యుడీషియల్ రిమాండ్ ను ఆగస్ట్ 13వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణ కీలక దశలో ఉంది కాబట్టి రిమాండ్ ను పొడిగించాలని ఈడీ న్యాయమూర్తిని అభ్యర్థించింది. ఈడీ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం రిమాండ్ ను 14 రోజులు పొడిగిస్తూ తీర్పు ఇచ్చింది.
సీబీఐ ఛార్జి షీట్ పై విచారణ వాయిదా..
ఇదిలా ఉండగా కేసును ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత కేసులో సీబీఐ వేసిన చార్జిషీటుపై నేడు (బుధవారం-జూలై 31)) విచారణ జరగాల్సి ఉండగా వర్చువల్ గా కవితతో పాటు ఇతర నిందితులను హాజరు పరిచారు. సీబీఐ అధికారులు సీబీఐ కేసులో ఎమ్మెల్సీ కవిత ఏ17గా ఉన్నారు. ఈ కేసులో సీబీఐ ఈ ఛార్జి షీట్ పై విచారణను ఆగస్ట్ 9వ తేదీకి వాయిదా వేసింది.
సీబీఐ కేసులోనూ నిరీక్షణ
సీబీఐ కేసులో కూడా కవితకు చుక్క ఎదురైంది. ఇప్పటికే పలుమార్లు బెయిల్ కోసం పోరాటం చేసిన కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ను కోర్టులో దాఖలు చేసింది. ఇప్పటి వరకు కవితకు ఈ కేసులో బెయిల్ దొరకలేదు. ఈడీ ఓ వైపు, సీబీఐ మరో వైపు కవితను టార్గెట్ చేస్తూ మూకుమ్మడి దాడి చేస్తుంటే కవిత ఈ కేసులను ఎదుర్కొనేందుకు పోరాటం చేస్తోంది ఓటమి పాలవుతోంది. ఇటీవల ఆమె అనారోగ్యానికి కూడా గురైనట్లు తెలిసింది.