ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామ మందిరం పై లోక్ సభలో ఇవాళ చర్చ జరగనుంది. బిజెపి సీనియర్ నేత సత్యపాల్ సింగ్ రామ మందిర నిర్మా ణం బాల రాముడి ప్రాణ ప్రతిష్ట పై చర్చను ప్రారంభిస్తారు. చర్చ సందర్భంగా అధికారపక్ష సభ్యులు ప్రధాని మోదిని ప్రశంసించే అవకాశం ఉంది. రామమందిరం పై చర్చ నేపథ్యంలో తమ సభ్యులు నేడు సభకు తప్పనిసరిగా హాజరు కావాలని బిజెపి విప్ జారీ చేసింది. అటు ఇవాల్టితో పార్ల మెం టు బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి.