Nirmala Sitharaman:ఏపి ప్రభుత్వం కు ఎప్పటికప్పడు సూచనలు ఇస్తున్నాము.. నిర్మల సీతారామన్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఏపి ప్రభుత్వానికి ఎప్పటిక ప్పు డు సూచనలు, సలహాలు, హెచ్చరి కలు జారీచేస్తున్నా మని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతా రామ న్ తెలిపారు. లోక్‌సభలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ ఈ సమాధానమిచ్చారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగం లోని ఆర్టికల్ 293 అవకాశం కల్పించిందన్నారు .
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక దుర్వినియోగం వల్ల నాలుగే ళ్లుగా రాష్ట్రం ఇబ్బందులు పడుతుందని యంపీ రామ్మో హన్ నాయుడు అన్నారు. వ్యవస్థ ఒకవేళ రాష్ట్రం ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఏమిటి? రాష్ట్రాన్ని ఆర్థిక క్రమశిక్షణలో పెట్టడానికి ఏం చర్యలు తీసు కుంటారు’ అని ప్రశ్నించారు. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు రెండింటికీ ఎస్ఆర్బీఎం పరిమితి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఎఫెర్బీఎం యాక్ట్ గురించి అసెంబ్లీ చూసుకుంటుంది. ఆ చట్టానికి అనుగుణంగా అక్కడ చర్చలు చేపడతారు.తగిన చర్యలు తీసుకుంటున్నాం’ అని నిర్మలా సీతారామన్ వివరించారు.
జీఎస్టి వృద్ధిరేటు ఇటీవల కాలంలో మందగించిన నేప థ్యంలో దానిపై ఆధార పడిన ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల ఆర్థిక స్థిరత్వానికి కేంద్ర ప్రభుత్వం ఏదైనా అదనపు చర్య లు తీసుకుంటోందా అని వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి లిఖిత పూర్వకంగా అడిగిన ప్రశ్నకు ఆర్థికమంత్రి బదులిస్తూ జీఎస్టి ద్వారా ఆదాయం క్రమంగా పెరుగుతోందే తప్ప తగ్గడం లేదన్నారు. ప్రస్తుత ఆర్థికసంవత్సరం తొలి 10నెలల్లోనే 11.6% వృద్ధిరేటును నమోదు చేసినట్లు గుర్తుచేశారు. ఏపీ ప్రభుత్వానికి 2017 జులై నుంచి 2022 జూన్ వరకు జీఎస్ట పరిహారం కింద రూ.19,021 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు.