NDA alliance : ఏపీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి ముందంజలో ఉంది. అసెంబ్లీ ఫలితాల్లో మ్యాజిక్ ఫిగర్ (88)ను దాటి ముందుకు సాగుతోంది. ఇప్పటి వరకు టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు 120కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీ కేవలం 15 చోట్ల మాత్రమే లీడ్ లో ఉంది. తొలి రౌండ్ నుంచే కూటమి అభ్యర్థులు పూర్తిస్థాయిలో మెజార్టీని కనబరుస్తున్నారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో సత్తా చాటారు. వైసీపీకి పట్టున్నట్లుగా భావించే రాయలసీమ జిల్లాల్లోనూ కూటమికే లీడ్ రావడం గమనార్హం.
లోక్ సభ స్థానాల్లోనూ ఎన్డీయే కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. శ్రీకాకుళంలో కింజరాపు రామ్మోహన్ నాయుడు (టీడీపీ), అనకాపల్లిలో సీఎం రమేశ్ (బీజేపీ), రాజమహేంద్రవరంలో దగ్గుబాటి పురందేశ్వరి (బీజేపీ), విజయవాడలో కేశినేని చిన్ని (టీడీపీ) ముందంజలో ఉన్నారు. గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్ (టీడీపీ), నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (టీడీపీ) ఆధిక్యంలో కొనసాగుతున్నారు.