నటి నయనతారకు తమిళనాట ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దీంతో లెజెండ్ శరవన్ తన తొలి సినిమా ది.లెజెండ్ లో ఆమెను హీరోయిన్ గా తీసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేశారట. అందుకోసం ఆమె ఇంటి చుట్టూ తిరిగేవారంటూ కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానని ఆయన ఆఫర్ ఇవ్వగా రూ.100 కోట్లు ఇచ్చినా చేయనని నయన తార తెగేసి చెప్పేశారట. చేసేది లేక ఊర్వసి రౌతేలాను మూవీ లో హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. చూశారు కదా నచ్చక పోతే ఏంత డబ్బు ఇస్తామని స్టార్ డైరెక్టర్ లు వెంటపడినా నయన తార మాత్రం నో అని చెప్పేశారు..
ప్రస్తుత కాలంలో ఆఫర్ రావాలి అంటే ఎంతో కష్టం అని చెప్పవచ్చు. ఓకానొక సందర్బంలో ఆఫర్స్ కోసం డైరెక్టర్ల చుట్టూ తిర గాల్సి వచ్చేది. కానీ తమిళనాట అలా కాదు క్రేజ్ ఉన్న హీరోయిన్ కోసం అక్కడి డైరెక్టర్లే క్యూ కడతారని నయనతార ఎపి సోడ్ చూస్తే మనకు అర్థం అవుతుంది.