పాక్ మాజీ పీఎం నవాజ్ షరీఫ్ కుమార్తె మరియo చరిత్ర సృష్టించారు. దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన పంజాబ్ రాష్ట్రానికి తొలి మహిళా సీఎం గా ఆమె ప్రమాణస్వీకారం చేశారు. సీఎంగా తన ఎన్నిక దేశంలోని ప్రతి మహిళకు గర్వకారణమని ఆమె తె లిపారు.
ఇదే తరహాలో మున్ముందు కూడా మహిళల్ని ఎన్నుకొని సాంప్రదాయం కొనసాగాలని అభిలషించారు. సొంత పార్టీ పీఎంఎల్- ఎన్ తో పాటు 20 మంది స్వతంత్రులు, ఇతర చిన్న పార్టీల మద్దతుతో ఆమె సీఎం కాగలిగారు