Naren Kodali : తానా 2023 అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ మేరకు కమిటీ అధ్యక్షుడు ఐనంపూడి కనకం బాబు ప్రకటించారు. తానా అధ్యక్షుడిగా క్రిష్ణా జిల్లాకు చెందిన వర్జీనియా ప్రవాసుడు డాక్టర్ నరేన్ కొడాలి విజయం సాధించారు. ఆయనకు 13,225 ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్థి వేమూరి సతీష్ కు 10,362 ఓట్లు పోలయ్యాయి. నరేన్ కు ఇది తొలి విజయం. గతంలో నిరంజన్ శ్రుంగవరపు చేతిలో ఓటమి పాలైన ఆయన 2023లో అధ్యక్షుడిగా గెలుపొందారు.
కోర్టు కేసుల కారణంగా తానా ఎన్నికలు జరిగాయి. తన శాయిశక్తులా పనిచేసి తానా అధ్యక్ష పీఠంపై ఇంద్రుడిలా అవతరించాడు. తన ప్యానల్ విజయానికి బాటలు వేశారు. మాజీల నుంచి ఆయనకు లభించిన ప్రోత్సాహంతో రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి విజయ తీరాలు అందుకున్నారు. కోమటి, నాదెళ్ల, వేమన, నన్నపనేని, గోగినేని వంటి మాజీ సహకారంతో ముందడుగు వేశారు.
ప్రజాస్వామ్యానికి ఆధారంగా నిలిచే ఎన్నికలుగా నిలిచాయి. తానా ఎన్నికల్లో విధేయత, విశ్వసనీయత చూపుతానని చెప్పారు. తానాకు అమెరికాలో శాశ్వత భవనం నిర్మించేందుకు తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. దీనికి గాను తన సొంత నిధుల నుంచి లక్ష డాలర్లు విరాళంగా అందజేశారు. రెండున్నర లక్షల డాలర్లు డాలర్లు సమీకరించి భవనం పూర్తి చేస్తామన్నారు.
తానాలో అత్యధిక మంది ఎఫ్1, హెచ్ 1 వీసాలపై అమెరికాకు వచ్చి ఉంటున్నారు. అలాంటి వారికి ఇద్దరు లాయర్లతో శాశ్వత న్యాయసేవల విభాగాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. దీనికి గాను తన సొంత నిధుల నుంచి 50 వేల డాలర్లు విరాళంగా ఇస్తానని చెప్పారు. అమెరికాలోనే పుట్టి పెరిగిన యువతకు పోటీ పరీక్షల్లో శిక్షణ, సన్నద్ధత వంటి కార్యక్రమాలు ఏర్ాటు చేస్తామన్నారు.