JAISW News Telugu

Gaddar : గద్దర్ తిరస్కరించిన “నంది అవార్డు’ కే గద్దర్ పేరుతో అవార్డు ప్రకటన సరికాదు.

Gaddar :తొలితరం సినిమా ల నాటి సామాజిక పరిస్థితులు, పాటలు, చిత్రీకరణ సమాజానికి ఆదర్శంగా, దోపిడీ -పీడనలపై తిరుగుబాటు ఎగరేసేవిగా ఉండేవి. అయితే సామాజిక మాధ్యమాల్లో ప్రతిభావంతమైన సినిమా బాటను అనివార్యంగా ఆరుద్ర, శ్రీ శ్రీ లు ఎంచుకున్నారు.  ప్రస్తుత సినిమాలు 99.9% పూర్తి భిన్నంగా పెఢదోరణిలో వస్తున్నాయి . ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే? ఒరేయ్ రిక్షా (1995) సినిమాలో మల్లె తీగకు పందిరి ఓలె అనే పాటకు , జైబోలో తెలంగాణ చిత్రం లో పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా? పోరు తెలంగాణమా అనే పాటకు ప్రభుత్వం నందిఅవార్డులు ప్రకటించింది.

గద్దర్ , నంది అవార్డులు తిరస్కరించాడు. ఈ విషయాలు పరిగణలోకి తీసుకోవడం ఎంతైనా అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో గద్దర్ పేరుతో ప్రత్యేక అవార్డు ఇస్తే బాగుంటుంది అని భావించడంమే తప్ప మరో కోణం లేదు. వర్గ కుల నిర్మూలన ప్రచారానికి ఏ మేరకు ఈ అవార్డు దోహదం చేస్తుంది? అన్నది ఆలోచన చేయాలి. ఆయన పేరుతో అవార్డు ఇవ్వడానికి ఎవరికీ అభ్యంతరం లేదు, ఉండాల్సిన అవసరమూ లేదు.సరైన న్యాయం జరగదనే ఆందోళన మాత్రమే. ఇందు కోసం నంది అవార్డు పేరు మార్చి- గద్దర్ అవా ర్డు గా ప్రకటించడం కంటే ప్రత్యేకంగా గద్దర్ అవార్డు ఏర్పాటు చేస్తే సామాజిక ప్రయోజనం నెరవేరుతుందనే భావనతో కూలంకషంగా పరిశీలించాలి, అర్థం చేసుకోవాలి.

Exit mobile version