నాగర్ కర్నూల్ నల్లమల అడవిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో నల్ల మల అడవి దగ్ధం కావడం వల్ల కిలో మీటర్ల మేర మంటలు వ్యాపించాయి. దోమలపెంట, కొల్లంపెంట, కొమ్మనపెంట, పల్లెబైలు, నక్కర్లపెంట ప్రాంతాల్లో 50 హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం దగ్ధమైనట్లు సమాచారం అందుతుంది. కిలో మీటర్ల మేర మంటలు భారీగా వ్యాపించడంతో ఈ మంటలార్పేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.మంటలు ఆర్పేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నా కానీ మంటలు మాత్రం అదుపులోకి రావడం లేదు. దోమల పెంట,కోల్లంపెంట తదితర ప్రాాంతాల్లో పూర్తిగా మంటలు వ్యాపించాయి. దట్టమైన పోగలు,మంటలు ఎగసి పడుతుండటంతో మంటలు ఆర్పడానికి అటవీ శాఖ సిబ్బందికి చాలా శ్రమించాల్సి వస్తోంది.