చిన్నప్పటినుంచి పోలీస్ ఆఫీసర్ కావాలనేది తన కల అని భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ తెలిపారు. ఇది ఎంత కష్టమైన వృత్తో తనకు తెలుసని.. కానీ ఒకసారి అయినా యూనిఫామ్ వేసుకోవాలని అనుకున్నట్లు ఆమె చెప్పారు. యూపీ ప్రభుత్వం ఆమెను డిఎస్పీగా నేపథ్యంలో మహిళా క్రికెటర్ దీప్తి శర్మ ఈ వ్యాఖ్యలు చేశారు.
డీఎస్పీ ఉద్యోగం పొందడం పట్ల ఆమె సం తోషాన్ని వ్యక్తపరిచారు. క్రికెటర్ గా వాళ్ల ప్రదర్శనలకు యూపీ ప్రభుత్వం మూడు కోట్ల నగదు బహుమ తిని కూడా ప్రక టించింది. స్పోర్ట్స్ లో ఎంతో అద్భుతంగా రాణించిన మహిళా క్రికెటర్ దీప్తి శర్మ ఎన్నో మ్యాచ్ లు ఆడి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించు కున్నారు.