Municipal Officer : ఏసీబీ వలలో మున్సిపల్ అధికారి.. పట్టుబడ్డ నోట్లకట్టలు

Municipal Officer
Municipal officer : అవినీతి అధికారుల గుండెల్లో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ గుబులు పుట్టిస్తోంది. తాజాగా నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులకు మరో భారీ అవినీతి తిమింగలం పట్టుబడింది.
నిజామాబాద్ మున్సిపల్ కార్పిరేషన్ సూపరింటెండెంట్, రెవెన్యూ అధికారి దాసరి నరేందర్ వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని సమాచారంతో ఏసీబీ అధికారులు ఆయన నివాసం, కార్యాలయం, బంధువుల ఇళ్లలో శుక్రవారం సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో ఏసీబీ అధికారులు భారీ మొత్తంలో గుట్టలుగా ఉన్న నోట్ల కట్టల్ని గుర్తించారు. మొత్తం రూ.6.70 కోట్లను స్వాధీనం చేసుకున్నారు.