Mukesh Kumar Meena: తనిఖీలపేరిట సామాన్యులను ఇబ్బంది పెట్టొద్దు…ముఖేష్ కుమార్ మీనా
Mukesh Kumar Meena: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తనిఖీల పేరిట సామాన్యులను ఇబ్బంది పెట్టకూడదని రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అధి కా రులను ఆదేశించారు. ఎన్ని కల కోడ్ అమల్లోకి వచ్చేంతవరకు రూ. 10 లక్షలు అంతకంటే ఎక్కువ నగదు పట్టుబడితే దాన్ని జప్తు చేసి ఆదాయపు పన్ను శాఖకు సమాచా రం ఇవ్వాలని సూచించారు. శాఖల మధ్య పరస్పర, సమాచారం మార్పిడి సమన్వయం కోసం ప్రత్యేక యాప్ అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన వెల్లడించారు.
తనిఖీల పేరుతో కొంత మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎన్నికల సంఘం దృష్టికి రావడంతో నే ఎన్నికల అధికారి స్పందించినట్లు తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా విడుదల కాకముందే ఇప్పటి నుంచే తనిఖీల పేరుతో ఇబ్బంది పడితే ఆ ప్రభావం ఎన్నిక లపై పడుతుందని బావించినట్లు తెలుస్తోంది..
మెత్తం మీద 10 లక్షల లోపు నగదు ఉంటే పట్టుకోవడానికి వీలు లేదని తెలుస్తోంది.. అయితే ఉన్న నగదుకు సరైన ఆధారాలు చూపించారు..10 లక్షలు ఆపై నగదు పట్టుబడితే కచ్చితంగా సీజ్ చేసే అవకాసం ఉంది.