ఒంగోలు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివా సు లు రెడ్డి వ్యవహారం కొ ద్ది రోజులుగా ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. మాగుంట త్వరలో పార్టీ మారబోతున్నారని, తెలుగుదేశం లేదా భారతీయ జనతా పార్టీలో ఆయన చేరబోతున్నారని ప్రచా రం జోరుగా సాగుతుంది.
ఆయన వ్యవహార శైలి పట్ల అటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అసంతృప్తిగా ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. అందరూ ఊహించినట్టుగానే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైఎ స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు మీడియా సమావేశం పెట్టి పలు కీలక విషయాలను ఆయన వెల్లడించారు.