MP Lau-TDP: టిడిపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంపీ లావు.
ఏపీ: పల్నాడు జిల్లాలో జరిగే చంద్రబాబు బహిరంగ సభలో టిడిపిలో చేరుతున్నట్లు ఎంపీ లావు కృష్ణదేవరాయలు ప్రకటించారు. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా మళ్లీ పోటీ చేస్తానని ఆయన తెలిపారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని పల్నాడు అభివృద్ధికి కృషి చేశానని మరోసారి అవకాశం ఇస్తే అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తానని ఎంపీ లావు కృష్ణదేవరాయలు అన్నారు.
కాగా ఇటీవల ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను నరసరావుపేట ఇన్చార్జిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియమించింది. దీంతో ఎంపీ లావు అసంతృప్తితో పార్టీని వీడారు. చంద్రబాబు సమక్షంలో పార్టీలోకి చేరి కచ్చితంగా నరసరావుపేట ఎంపీగా గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.