Monkey Fever in Karnataka: కర్ణాటకలో మంకీ ఫీవర్ తో ఇద్దరు కన్నుమూయడం కలకలం రేపుతోంది. శివమొగ్గ జిల్లాలో యువతి, ఉడిపి జిల్లాలో ఓ వృద్ధుడు ఈ వైరస్తో మృతి చెందినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఉత్తర కన్నడలో 34 శివమొగ్గలు 12 చిక్కమంగళూరులో మూడు కేసులు గుర్తించారు. కీటకాలు కోతులను కుట్టిన తర్వాత తిరిగి మనిషికి కుడితే వైరస్ వస్తుందని వారు వివరించారు.
ఈ వైరస్ తో ఇప్పటికే ఇద్దరు మృతి చెందడంతో కర్ణాటక అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల న్నా రు. కీటకాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కోతులను కుట్టిన కీటకాలు మనుషులను కుట్టడం వల్లనే ఈ వైరస్ వ్యాపిస్తుంది కాబట్టి ప్రజ లు జాగ్రత్తగా ఉండాలన్నారు. కర్ణాట కలో అధికారులు ఈ వైరస్ పై అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు వాగ్రత్త వహించక పోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీచేశారు.