Monkey Fever : కర్ణాటకలో మంకీ ఫీవర్…నలుగురు మృతి.. అప్రమత్తమైన అధికారులు..

Monkey Fever
Monkey Fever : కర్ణాటకలో మంకీ ఫీవర్ విజృంభిస్తుంది. ఈనెల 25 వరకు 5000 మందికి పరీక్షలు చేయగా, 120 పాజిటివ్ కేసులు నమోద యా యని అక్కడ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు నలుగురు మంకీ ఫీవర్ తో మృతి చెందారని తెలిపారు.
దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. టెస్టుల సంఖ్యను పెంచడంతోపాటు అవగాహన కార్యక్రమాలను కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోంది. మంకీ ఫీవర్ సోకిన వారికి 3-8 రోజుల తర్వాత వణుకుడు, జ్వరం, తలనొప్పి, కండరాల, నొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయని కర్ణాటక అధికారులు తెలిపారు.