Mohan Charan Majhi : ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ

Mohan Charan Majhi
Mohan Charan Majhi : ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీ ఎంపికయ్యారు. డిప్యూటీ సీఎంలుగా కనక్ వర్ధన్ సింగ్ దేవ్, ప్రవతి పరీదా లకు అవకాశం లభించింది. మాఝీని బీజేపీ శాసనసభాపక్ష నేతగా రక్షణ మంత్రి రాజ్ నాథఖ్ సింగ్ ప్రకటించారు. మోహన్ మాఝీ కియోంజర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. వీరు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం బుధవారం సాయంత్రం 5 గంటలకు జనతా మైదానంలో జరుగనుంది. ఈ కార్యక్రమంలో పీఎం మోదీ పాల్గొననున్నారు. ఆయనతో పాటు మరి కొందరు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు ఆహ్వాన లేఖ అందజేసినట్లు బీజేపీ తెలిపింది.