MLA Vasantha : వైసీపీని వీడనున్న ఎమ్మెల్యే వసంత కృష్ణ…నేడు కీలక ప్రకటన?

ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడనున్నారు. నిన్న తన అనుచరులతో కృష్ణ ప్రసాద్ సమా వేశమయ్యారు. ఈరోజు కూడా వారితో ప్రత్యేకంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తారని ఆయన తెలిపారు. స్థానికంగా పార్టీలో అం తర్గత సమస్యల కారణంగా పలుమార్లు ఆయన తన అసంతృప్తిని బాహాటంగానే తెలియజేశారు. ఇటీవల దెందులూరు సిద్ధం సభకు కూడా ఆయన హాజ రు కాలేదు.  ఇక్కడ ఇన్చార్జిగా తిరుమల యాదవులు వైసిపి అధిష్టానం ప్రకటించడంతో  ఎమ్మెల్యే అసంతృప్తితో ఉన్నారు. నేడు  కార్యకర్తలతో సమావేశం నిర్వహించి పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.వైసిపి నిర్ణయాల వల్ల ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు వైసీపీని వీడి ఇతర పార్టీలోకి వెళ్లారు.  వారి బాటలోనే ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే కూడా ఉన్నారని తెలుస్తోంది. మెత్తం నేడు మరో సారి కార్యకర్తలతో సమాలోచనలు చేసిన తర్వాత ఏ పార్టీలోకి వెళ్తున్నారన్నది తెలియజేసే అవకాశం కనిపిస్తోంది.  

TAGS