Minister Ponnam:ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పై మంత్రి పొన్నం ఫైర్…బిఆర్ఎస్ నేతలను ఒకఆట ఆడుకున్న మంత్రి?
పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ఇంకా అధికారంలో ఉన్నాం..మేము ఏది చెబితే అది వినాలె అనే ఫీలింగ్ లో ఉన్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యా నించారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తరువాత ఇప్పటి వరకు 15 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని మంత్రి తెలిపారు. 535 కోట్ల విలువ గల బస్ ఫైర్స్ ని ప్రభుత్వం చెల్లించిందన్నారు. ఆటో డ్రైవర్లకు నెలకి రూ. 15000 ఇవ్వాలని హరీష్ రావు అంటున్నారు..
మీ హయం లో ఎందుకు ఇయ్యలేదని ప్రశ్నించారు. ఆటో పన్ను రద్దు చేస్తున్నామని చలాన్ ల పేరుతొ వేల రూపాయలు వసులు చేశారని మంత్రి ఆరోపించారు. సభ ని తప్పుదోవ పట్టించే విధంగా 21 మంది ఆత్మహత్య చేసుకున్నారని అంటున్నారు..మీరే ప్రేరేపిస్తున్నారా అని ప్రశ్నించారు. బస్సులు ప్రయాణికుల దగ్గరకు వెళ్లడం లేదు..
ప్రయాణికులె బస్సుల దగ్గరకు ఆటో ల ద్వారా వస్తున్నారన్నారు. అక్క చెల్లెలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే మీకు ఎందుకు ఈర్ష.. వాళ్ళకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించద్దా…? మీరు వ్యతిరేకిస్తున్నారా..గతంలో మీరు ఎపుడైనా ఆటోల్లో ప్రయాణం చేసారా… ఈ రోజు పెద్ద పెద్ద దొరలు ఆటో ల్లో వస్తున్నారని బిఆర్ఎస్ నేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ విరుచుకుపడ్డారు.
అహంకార ఫ్యూడల్ గా ఆటో ల్లో ప్రయాణం చేస్తున్నారన్నారు. ఆటో కార్మికులు జీవానోపాధి కోసం నడుపుకుంటే ఈ ఫ్యూడల్స్ ఆటో ల్లో వచ్చి ఆటో కార్మికులను అవమానప రు స్తున్నారు..? ఆర్టీసీ ని ప్రక్షాళన చేస్తున్నాం..గతం లో ముఖ్యమంత్రి బందువు ఎక్స్క్యూటివ్ డైరెక్టర్ రిటైర్డ్ అయిన తరువాత కూడా 4 సంవత్సరాలు ఎండి గా ఉన్నారు.. .