Janasena: సీఎంకు తెలియకుండా మంత్రి అమర్నాధ్ కోట్లు దోచుకున్నారు.. జనసేన నేత మూర్తి యాదవ్
Janasena: పరిశ్రమల శాఖామంత్రి గుడివాడ అమర్నాధ్ ముఖ్యమంత్రి జగన్ పేరుచెప్పి ఆయనకు తెలియకుండా ఐదు వందల కోట్ల రూపాయలను సంపా దించడం వల్లే టికెట్ పోయిందని జనసేన కార్పోరేటర్ మూర్తి యాదవ్ ఆరోపించారు. సోమవారం పౌర గ్రంధాలయంలో ఆయన విలేకరులతో మా ట్లాడుతూ, మంత్రులలో చిన్నవాడైన అమర్నాధ్ కు ఎంతో ప్రేమతో ముఖ్యమంత్రి జగన్ కీలక మైన శాఖలు అప్పగిస్తే ఉత్తరాంధ్రా సీనియర్ మంత్రులు, చివరకు ముఖ్యమంత్రి షాక్ అయ్యేవిధంగా వందల కోట్లు సంపాదించారని పేర్కొన్నారు.
ఆ కారణంగానే కోడిగుడ్డు మంత్రి అమర్ కు ఇటు ఎం ఎల్ ఏ సీటు, అటు ఎం పీ సీటు దక్కలేదని, అందుకే తన తలరాత జగన్ రాస్తారంటూ మెట్ట వేదాంతం వల్లిస్తున్నాని ఎద్దేవా చేశారు. గంగవరం పోర్టు ను జగన్ అమ్మేస్తే… అందులోకి రూ.200 కోట్ల స్ర్కాప్ ను అమర్ అమ్మేశారు వేల కోట్ల లం చాల కోసం గంగవరం పోర్టులోని ప్రభుత్వ వాటాలను జగన్ అదానీకి అమ్మేస్తే అదే బాటలో అక్కడ నిల్వ వున్న రూ. 200 కోట్ల విలువైన స్క్రాప్ ను ఏకంగా జగన్ పేరు చెప్పి అమర్ అమ్మేసుకొన్నారు.
విజయ నగరం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్న శ్రీను, విశాఖ రూరల్ పార్టీ అధ్యక్షుడు, అమర్ బినామీ అయిన బొడ్డేటి ప్రసాద్, మాజీ జడ్పీటీసీ, జిల్లా రైతు సలహ మండలి సభ్యుడు చిక్కాల రామారావులతో కలసి ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా చక్కబెట్టేశారు. సాటి వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభ్యడు కరణం ధర్మశ్రీ ఈ కుంభకోణాన్ని ముఖ్యమంత్రి దష్టికి తీసుకువెళ్లేంత వరకూ తెలియకపోవడం పట్ల షాక్ కు గురైయ్యరు.
పాయకరావుపేట దక్కన్, నక్కపల్లి హెటిరో డ్రగ్స్ లోనూ కుంభకోణాలే ననిన పరిశ్రమల మంత్రి హోదాలో విశాఖకు కొత్త పరిశ్రమలను తీసుకురాకపోగా వున్న కంపెనీలను బెదిరించి కోట్లలో అమర్ గ్యాంగ్ లబ్ధి పొందినట్లు తెలిసింది. దక్కన్ కెమికల్స్, హెటిరో డ్రగ్స్ వంటి పరిశ్రమల నుంచి భారీగా వసూలు చేయడం తో పాటు వాటికి బొగ్గు సరఫరా చేసే కాంట్రాక్ట్ ను తీసుకొన్నారని ముఖ్యమంత్రికి ఫిర్యాదులు వెళ్లాయి.