JAISW News Telugu

YCP leaders : రైల్వేబోర్డు ఛైర్ పర్సన్ తో వైసీపీ నేతల భేటీ

YCP leaders :   రైల్వే బోర్డు ఛైర్ పర్సన్ జయవర్మ సిన్హాను ఎంపీలు కేశినేని నాని, అయోధ్య రామిరెడ్డి, రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు.. ఢిల్లీలోని రైల్ భవన్లో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో రైల్వే అభివృద్ధి పనులపై సుధీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా గుణదలలో రైల్వే ఓవర్ బ్రిడ్జిని (LC No.8) వందశాతం రైల్వే నిధులతో ప్రధానమంత్రి గతిశక్తి ప్రాజెక్టు కింద చేపట్టి పూర్తి చేయవల సిం దిగా కోరారు.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ. 12 కోట్ల నిధులతో ఆర్.ఓ.బి.కి అవసరమైన భూసేకరణ సైతం పూర్తిచేసినట్లు తెలిపారు. అలాగే మధురానగర్ పప్పుల మిల్లు వద్ద, రాజరాజేశ్వరి పేట, వాంబే కాలనీలలో గతి శక్తి ప్రాజెక్టు కింద చేపట్టాల్సి ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్.ఓ.బి.) ల నిర్మాణాలకు సంబంధించి రైల్వే శాఖ కోరిన అన్ని క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఇప్పటికే అందజేసినట్లు తెలిపారు.

రైల్వే అనుమతులు వీలైనంత త్వరగా మంజూరు చేసి ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి తోడ్పాటును అందించవలసిందిగా కోరారు. అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో నానాటికి పెరిగిపోతున్న ట్రాఫిక్ దృష్ట్యా.. మరో బాక్స్ కల్వర్ట్ మార్గానికి అనుమతినివ్వవలసిందిగా విన్నవించారు. రామకృ ష్ణాపు రం – దేవీనగర్ రైల్వే అండర్ పాస్ వద్ద రహదారి నిర్మాణానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోరారు.

మరోవైపు జగ్గయ్యపేట రైల్వే స్టేషన్ లో నూతన ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, ప్లాట్ ఫామ్ ల అభివృద్ధితో పాటు స్టేషన్ బిల్డింగ్ ను వీలైనంత త్వరగా నిర్మించవలసిందిగా విన్నవించారు. మోటుమర్రి నుంచి విష్ణుపురానికి పాసింజర్ రైలు సదుపాయం కల్పించవలసిందిగా కోరారు. ఈ మేరకు విన తిపత్రం అందజేయగా.. ఛైర్ పర్సన్ సానుకూలంగా స్పందించినట్లు వైసీపీ నేతలు తెలిపారు. వీరి వెంట వైసీపీ కౌన్సిలర్, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను కుమారుడు సామినేని శ్యాం ప్రసాద్ ఉన్నారు.

Exit mobile version