America Consulate: హైదరాబాద్ అమెరికా కాన్సలేట్ లో తాపీ మేస్త్రీ ఉద్యోగం..జీతం ఎంతో తెలుసా!

హైదరాబాద్ కాన్సులేట్  జనరల్ కార్యాలయంలో తాపీ మేస్త్రి ఉద్యోగాన్ని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. నెల జీతం లెక్కలో చూస్తే రూ. 37,279గా తాపీ మేస్త్రి వేతనాన్ని నిర్ణయించారు.  వేతనంతో పాటు అదనపు ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి . ఈ ఉద్యోగాన్ని ఫుల్ టైం జాబ్ గా పేర్కొన్నారు. ఎవరైనా ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అమెరికా కాన్సుల్ వర్గాలు ప్రకటించాయి. అమెరికా కాన్సుల్లో శాశ్వత ఉద్యోగం గా పేర్కొన్నారు ప్రొబేషనరీ పీరియడ్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఎంపికైన అభ్యర్థి వారానికి 40 గంటల పాటు పనిచేయాల్సి ఉంటుంది. ధ్రువపత్రాల ధ్రువీకరణ బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ తర్వాత కనీసం నాలుగు నుంచి 8 వారాల్లో ఉద్యోగంలో చేరాల్సి ఉంటుంది. విధుల్లో భాగంగా కొత్త గోడలు నిర్మించడం కాంక్రీట్ సహా తాపీపనులు చేయాల్సి ఉంటుంది. కనీసం రెండేళ్లు వృత్తి అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.  కాంక్రీట్ మిక్సర్లలో రకాలు రకరకాల ఇటుకలతో నిర్మాణం ఫ్లోరింగ్ పనులు మార్బల్ ఫ్లోరింగ్ రాతి కట్టడాల నిర్మాణంలో అనుభవం ఉండాలి.

దీంతోపాటు రకరకాల పనులకు మెటీరియల్ అంచనాలు రూపొందించగలగాలి తాపీ మేస్త్రి ఉద్యోగానికి ఆన్లైన్లో దరఖాస్తులను ఫిబ్రవరి 25 లోక సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థి కనీసం ఎనిమిదవ తరగతి పూర్తి చేసి ఉండాలి ఇంగ్లీష్ అర్థం చేసుకోవాలి. లెవెల్ వన్ ఇంగ్లీష్ నైపుణ్యాన్ని పరీక్షిస్తారు తెలుగు హిందీ భాషల్లో లెవెల్ 3 వరకు నైపుణ్యాన్ని పరిశీలిస్తారు ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు మెడికల్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది సెక్యూరిటీ ధ్రువీకరణలో అర్హత సాధించాల్సి ఉంటుంది.

TAGS