JAISW News Telugu

Family Court : భర్తకు భరణం ఇవ్వాలి…మధ్యప్రదేశ్ ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పు…

మధ్యప్రదేశ్ లోని  ఇండోర్ ఫ్యామిలీ కోర్టు ఆసక్తికర తీర్పునిచ్చింది. భర్తకు ప్రతినెల రూ 5 వేల భరణం ఇవ్వాలని గృహహింస కేసు పెట్టిన మహి ళను ఆదేశించింది. భర్త పై ఆ మహిళ చేసిన ఫిర్యాదుకు కోర్టులో ఆమె వాదనలకు పొంతన లేకపోవడంతో ఈ మేరకు కోర్టు తీర్పునిచ్చింది. ఉజ్జ యినికి చెందిన  అమన్ ఈ యువతి  ప్రేమించుకుని 2021లో పెళ్లి చేసుకున్నారు.

భార్య పెట్టే హింస భరించలేక అమన్ తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోవడంతో ఆమె కేసు పెట్టింది.  భర్త తల్లి,దండ్రుల దగ్గరకు వెళ్లిపోయాడన్న కారణంతో ఎలాగైన తన దగ్గరకు రప్పించాలనే ఉద్దేశ్యం తో ఈ మహిళ అతని పై గృహహింస చట్టం కింద కేసునమోదు చేసింది.  అయితే కేసు పూర్వపరాలు పరిశీలించిన న్యాయస్థాినం ఆ మహిళ ఉద్దేశ్య పూర్వకంగా నే కేసు పెట్టిందని గ్రహంచి ప్రతి నెల భరణం 5 వేల రూపాయలు ఇవ్వాలని ఆదేశించింది.

Exit mobile version