మాజీ ఉప ప్రధాని బిజెపి సహ వ్యవస్థాపకులు ఎల్కే అద్వానికి కేంద్ర ప్రభుత్వం భారతరత్నను ప్రకటించింది. సీనియర్ నేతకు దేశ అత్యున్నత పురస్కారం లభించ డంపై ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు. దేశ నిర్మాణంలో ఎల్కే అద్వానీ కీలక పాత్ర పోషించారని ప్రధానమంత్రి మోడీ ప్రశంసించారు. దివంగత ప్రధాని భారతరత్న వాజ్పేయి హయాంలో లాల్ కృష్ణ ఉప ప్రధాని గా సేవలందించారు. కాగా బీహార్ మాజీ ముఖ్య మంత్రి దివంగత కర్పూరి ఠాకూర్ కు కేంద్రం గతవారం భారతరత్న ప్రకటించింది.