కర్నూలు పోలీసుల వాహానాల తనీఖీలు.
భారీగా పట్టుబడిన బంగారము & వెండి & నగదు మొత్తం విలువ రూ. 4,కోట్ల59 లక్షలు.
ఏలాంటి పత్రాలు లేని బంగారం, వెండి తో పాటు నగదు స్వాధీనం చేసుకున్న వెల్దుర్తి సర్కిల్ పోలీసులు.
KURNOOL: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణ కాంత్ ఐపీఎస్ ఆదేశాల మేరకు నిన్న రాత్రి 11 గంటలకు క్రిష్ణగిరి మండలం, అమకతాడు గ్రామ శివారులోని జాతీయ రహదారి 44 పై ఉన్న టోల్ ప్లాజా వద్ద కర్నూల్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వాహనాల సోదాలు నిర్వహించారు. రాబడిన సమాచారం మేరకు హైదరాబాదు నుండి కోయంబత్తూరు వెళు తున్న NL 01 M 2506 సురేష్ స్వామి అయ్యప్ప ప్రవేట్ స్లీపర్ ఏసి ట్రావెల్స్ బస్సు నందు 4 వ్యక్తుల నుండి బంగారం , వెండి తో పాటు భారీగా నగదు ను వెల్దుర్తి సర్కిల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న వారి వివరాలు…
1). అమర్ ప్రతాప్ పవర్ తండ్రి పేరు ప్రతాప్ వయసు 25 నశ్యo స్ట్రీట్, నంద్యాల టౌన్ అతని వద్ద 1 కోటి 20 లక్షల 80 వేల నగదు.
2). వెంకటేష్ రాహుల్ తండ్రి వెంకటేష్, సావిత్రి నగర్ కోయంబత్తూర్ టౌన్ తమిళనాడు. ఇతని వద్ద 3 కేజీల195 గ్రాముల బంగారు& రూ. 19 లక్షల 23 వేల 5 వందల నగదు.
3). సెంథిల్ కుమార్ తండ్రి వెంకటరమణ కోయంబత్తూర్ టౌన్ తమిళనాడు. ఇతని వద్ద 44 లక్షల 50 వేల నగదు మరియు 1 కేజీ 37 గ్రాముల బంగారు.
4). శబరి రాజన్ తండ్రి పేరు సర్వానంద్ సేలం టౌన్ తమిళనాడు ఇతని వద్ద 5 కేజీల వెండి బిస్కెట్లు కలవు.
ఏలాంటి పత్రాలు లేని
5 కేజీల వెండి బిస్కెట్లు,
4 కేజీల 232 గ్రాముల బంగారు,
ఒక కోటి 84 లక్షల 53 వేల,500 రూపాయల నగదు సీజ్ చేయడం జరిగినది.