కంటోన్మెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిందే.. లాస్య నందిత కుటుంబాన్ని ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. లాస్య నందిత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం ప్రమాదం కు గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోయిందన్న విషయం తెలుకోని విస్మయానికి గురైనట్లు కేటీఆర్ చెప్పారు.
నేను విదేశాల్లో ఉండటం వల్ల రాలేక పోయానని ఆన్నారు. లాస్య నందితను గత పదిరోజులుగా అనేక ప్రమాదుల వెంటా డాయని,గతేడాది సాయన్న మరణించడం ఇప్పుడు లాస్య నందిత మృతితో కుటుంబ సబ్యులు,బీఆర్ఎస్ శ్రేణుల్లో తీరని శోకాన్ని నింపిందన్నారు.