KCR Cabinet Meeting:కేసీఆర్ సంచలన నిర్ణయం. ఫలితాల తరువాత కేబినెట్ భేటీ
KCR Cabinet Meeting: నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మరో రెండు రోజుల్లో ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మరి కొన్ని గంటల్లో తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. డిసెంబర్ 3 ఉదయం 8 గంటల నుంచి ఈసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించబోతోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.
డిసెంబర్ నాలుగో తేదీన సచివాలయంలో కేబినేట్ భేటీ జరుగుతుందని తెలిపారు. కొత్త సచివాలయంలో కేసీఆర్ అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ కేబినేట్ భేటీ జరుగుతుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో ముచ్చటగా మూడవ సారి విక్టరీ సాధిస్తామనే ధీమా కారణంగానే కేసీఆర్ తాజా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే కేసీఆర్ కేబినేట్ భేటీపై సర్వత్రా ఆసక్తకరమైన చర్చ జరుగుతోంది.
కేసీఆర్ నిర్ణయం అత్యాశా? లేక మూడవ సారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ధీమానా? అని రాజకీయా విశ్లేషకులు సెటైర్లు వేస్తున్నారు. అంతే కాకుండా కొంత కాలంగా సచివాలం వైపు కూడా తొంగి చూడని కేసీఆర్ ఎన్నికల ఫలితాల వెంటనే సచివాలయంలో కేబినేట్ భేటీకి రంగం సిద్ధం చేసుకోవడం ఏంటని కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే శుక్రవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రగతిభవన్‌లో పార్టీ ప్రతినిధులు, అభ్యర్థులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని, మూడవ సారి కూడా అధికారం చేపడతామని పార్టీ నేతలతో చెప్పినట్టుగా తెలుస్తోంది. ఎవరూ అధైర్యపడొద్దని, మరో సారి తామే గెలుస్తున్నామని నేతలకు భరోసా ఇచ్చినట్టుగా తెలిసింది. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేస్తుందని వెల్లడించడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది