MLC Kavitha : మద్యం కుంభకోణం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ కేసుకు సంబంధించి రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన డీఫాల్ట్ బెయిల్ పిటిషన్ ను ఎమ్మెల్సీ కవిత ఉపసంహరించుకున్నారు. కవిత దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం తుది విచారణను బుధవారానికి వాయిదా వేసింది. కానీ, తాజాగా పిటిషన్ ఉపసంహరించుకుంటున్నట్లు కవిత తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. చట్ట ప్రకారం ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నందున పిటిషన్ ఉపసంహరించుకుంటున్నట్లు వివరించారు.
సీబీఐ ఛార్జిషీట్ లో తప్పులున్నాయని పేర్కొంటూ, జులై 6న కవిత డీఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఎలాంటి తప్పులు లేవని సీబీఐ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ పరిగణనలోకి తీసుకుంటున్నట్లు జులై 22న ప్రత్యేక కోర్టు ప్రకటించింది. ఈ నెల 9న దీనిపై విచారణ జరపనుంది.