Kavitha Remand : తీహార్ జైలుకు కవిత.. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌

Kavitha Remand

Kavitha Remand

మాజీ సీఎం కూతురు, ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ ఉచ్చు రోజు రోజుకు బిగుసుకుపోతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో 2023 చివరలో సాక్షిగా విచారణ ఎదుర్కొన్న కల్వకుంట్ల కవిత. 2024, మార్చిలో నిందితురాలిగా అరెస్ట్ అయ్యింది. ప్రస్తుతం ఈడీ అదుపులో ఉన్న కవితను విచారణకు అప్పటించాలని ఈడీ కోర్టును కోరుతుంది. కానీ తనకు బెయిల్ ఇవ్వాలని కవిత న్యాయమూర్తులకు అర్జీలు పెడుతూనే ఉంది.

ఈ నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు మరో షాక్ తగలింది. ఈ కేసులో మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు రౌస్ ఎవెన్యూ కోర్టు నిరాకరించింది. ఈడీ తరుఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కు ఆదేశించింది. కోర్టు నిర్ణయంతో ఏప్రిల్ 9వ తేదీ వరకు కవిత జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉండనున్నారు.

కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఆమెను జైలుకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా వాదనల అనంతరం కోర్టు నుంచి బయటకు వస్తున్న క్రమంలో కవిత కామెంట్లు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. ‘ఇది మనీ లాండరింగ్ కేసు కాదని.. పొలిటికల్ లాండరింగ్ కేసు అని మీడియాతో అన్నారు. లిక్కర్ కేసులో ఒక నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చిందని, మరో నిందితుడి నుంచి రూ. 50 కోట్లను ఎలక్ట్రోరల్ బాండ్ల కింద తీసుకుందని’ కవిత ఆరోపించింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తుంది బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్.

అయితే ఏప్రిల్ 9వ తేదీ వరకు రిమాండ్ కు తరలించిన కోర్టు..  మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై మాత్రం ఏప్రిల్ 1తేదీ (సోమవారం) విచారణ చేపడతామని న్యాయస్థానం స్పష్టం చేసింది.

TAGS