Mudragada: వైసీపీ లో చేరునున్న కాపు ఉద్యమనేత ముద్రగడ

Mudragada
Mudragada : ఏపి..కాపు ఉద్యమ నేత ముద్రగడపద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందు తోంది. టిడిపి-జనసేన పొత్తు నేపద్యంలో గోదావరి జిల్లాలపై వైసిపి ప్రత్యేక దృష్టి పెట్టింది. కాపుల్లో బలమైన నేతగా ఉన్న ము ద్రగడను పార్టీలోకి రావాలని యంపీ ము ధున్ రెడ్డి ఆహ్వానించారు. ఈ నెల 12 న ముద్రగడ పార్టీలో చేరుతారని సమాచారం అందుతుంది.
అయితే పోటీ చేయకుండా పార్టీకి మద్దతు గా ముద్రగడ ప్రచారం చేస్తారని తెలుస్తోంది. ముద్రగడను రాజ్యసభకు పంపుతారని తెలుస్తోంది. మెదట ముద్రగడ వైసీపీలో చేరేప్రసక్తి లేదని తనను కలవడానికి కూడా వైసిపి నేతలు ఎవరూ రావద్దు అంటూ తెగేసి చెప్పిన ముద్రగడ ఇప్పుడు తన మన సు మార్చుకొని వైసీపీలో ఎందుకు చేరుతు న్నా రో అ ర్థం కావడం లేదని జనసేన నేతలు చర్చించుకుంటున్నారు.