JAISW News Telugu

Father Killed-his Son: కూల్‌డ్రింక్‌లో విషం కలిపి…కుమారుడిని చంపిన కన్న తండ్రి..అసలు ఏం జరిగిందంటే !

మెబైల్ ఫోన్ లో ఆశ్లీల వీడియోలు చూస్తూ స్కూల్లో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న 14 సంవత్సరాల కుమారుడిని ఓ తండ్రి హత్య చేశాడు. మహారాష్ట్రలోని సోలా పూర్ లో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు విజయ్ బట్టు ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. తమ కుమా రుడు కనిపించడం లేదని గతనెల 13 వ తారీకున తల్లి,దండ్రులు ఇద్దరు వచ్చి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారని తెలిపారు. వీరు ఫిర్యాదు ఇచ్చిన కాసేపటికే ఓక కుర్రాడి మృత దేహం కనిపించిందని పోలీసులు తెలిపారు. పోస్ట్ మార్టం నివేధికలో విషం తీసుకోవడం వల్లే కుర్రాడు చనిపోయాని తేలింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. వారి సమాధానాలు పోంతన లేకుండా ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. కుర్రాడి తండ్రిని గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విశాల్ చదువును పక్కన పెట్టేసి సెల్ ఫోన్ లలో ఆశ్లీల వీడియోలు చూస్తూ స్కూల్ అమ్మాయిను వేధించేవాడని తెలిసింది. విషయం తెలుసుకున్న తల్లి,దండ్రులు పద్దతి మార్చుకోనమని చెప్పినా ఆకుర్రాడు పెడచెవిన పెట్టాడు. మరో వైపు స్కూల్ నుంచి తల్లి,దండ్రు లకు ఫిర్యాదులు పెరిగాయి. కుమారిడి ప్రవర్తన కువిసిగి పోయిన తండ్రి జనవరి 13 వ తారీకున 14 సంవత్సరాల తన కుమారుడు విశాల్ ను బైక్ పై తుల్జాపూర్ రోడ్డుకు తీసు కెళ్లారు. అక్కడ కూల్ డ్రింక్ కోని అందుకోల విషం కలిపి కుమారిడికి ఇచ్చాడు. విశాల్ అపస్మారక స్థితికి చేరుకున్నాక తండ్రి తిగిగి ఓంటరిగా ఇంటికిచేరుకున్నాడు. అదే రోజు సాయంత్రం భార్య,భర్తలు ఇద్దరూ స్థానిక పోలీసు స్టేషన్ కు వెల్లి తన కుమారుడు కనిపించం లేదని ఫిర్యాదు ఇచ్చారు. దీంతో పోలీసులు ధర్యాప్తు ప్రారంబిం చా రు.విచారణలో కన్న తండ్రే హంతకుడని తేలడం తో కటకటాల నెనక్కి పంపారు.

Exit mobile version