JAISW News Telugu

JD Lakshminarayana : సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద జేడీ లక్ష్మీనారాయణ అరెస్టు

JD Lakshminarayana

JD Lakshminarayana

JD Lakshminarayana Arrested : ఎన్నికలు రాగానే నేతలు అలెర్ట్ అవుతుంటారు. తాజాగా జనసేన నుంచి వైదొలిగిన జేడీ లక్ష్మీనారాయణ సైతం యువత, ఉద్యోగాలు అంటూ సీఎం క్యాంప్ ఆఫీసు ముట్టడికి బయలు దేరారు. జనసేన నుంచి బయటకొచ్చిన జేడీ ఏ పార్టీలోనూ చేరలేదు. మళ్లీ జనసేనకు అన్నారు.. లేదు వైసీపీలోకి అన్నారు. ఎటూ చేరకుండా ఎటూ కాకుండా పోయారు.

తాజాగా సొంతంగా పోరుబాట పట్టి అరెస్ట్ అయ్యారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు డిమాండ్ చేస్తూ శుక్రవారం విద్యార్థి, యువజన, వివిధ రాజకీయ పార్టీల నాయకుడు చేపట్టిన, ఛలో సీఎం క్యాంప్ కార్యాలయం ఉద్రిక్తతలకు దారి తీసింది.

సీఎం కార్యాలయం వైపు నిరసనగా వెళుతున్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాసరావు, విద్యార్థి సంఘాల నాయకులు జిలానీలను తాడేపల్లి వద్ద పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు.

Exit mobile version