Janhvi Kapoor : ‘8 పీఎం మెట్రో’ సహా మంచి మంచి సినిమాలు.. క్రేజీ వెబ్ సిరీస్‌లలో నటించి మంచి గుర్తింపు సంపాదించిన బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య. యంగ్ జనరేషన్ కు సంబంధించి బాలీవుడ్‌కు దొరికిన మంచి నటుడు అని అందరూ అనుకుంటున్నారు. అతను క్రేజీ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తో కలిసి ‘ఉలఝ్’ అనే ఒక వెరైటీ మూవీలో నటించాడు. త్వరలోనే అది ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.
అయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో గుల్షన్.. జాన్వీ కపూర్ గురించి చేసిన కామెంట్ చర్చనీయాంశంగా మారింది. ఈ మూవీ షూటింగ్ సమయంలో జాన్వీ తనతో అంటీ ముట్టనట్లు ఉండేదని.. కేవలం సీన్స్ షూటింగ్ చేసే సమయంలో తప్పితే నాతో మాట్లాడేదే కాదని.. ఆమె తీరు తనను ఆశ్చర్యం కలిగించిందని గుల్షన్ పేర్కొన్నాడు. ఈ విషయం బాలీవుడ్ చర్చనీయాంశంగా మారడంతో గుల్షన్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చాడు.
‘జాన్వీ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. మా ఇద్దరి మధ్యా ఎలాంటి స్నేహం లేదు అని మాత్రమే చెప్పాను. అది మా తప్పు కాదు. జాన్వీ మంచి నటి. ప్రొఫెషనల్‌గా నటిస్తోంది. మా ఇద్దరి మధ్య సీన్స్ బాగా వచ్చాయి. జాన్వీ చేసే ప్రతీ మూవీ సెట్లోనూ చిత్ర బృందమంతా ఆమెతో కలిసి పోవాలని నిబంధన లేదు కదా. నేను ఎవరినీ కించపరచడం లేదు. ఉద్దేశపూర్వకంగా ఎవరిని తక్కువగా చూడడం లేదు.’
‘సినిమా కోసం పూర్తి స్థాయిలో ఎఫర్ట్ పెట్టాం. దర్శకుడు చెప్పింది చెప్పినట్లు చేశాం. నేను చాలా మంది హీరోయిన్లతో కలిసి నటించా. అందులో రాధికా ఆప్టే, సోనాక్షి సిన్హా లాంటి వాళ్లు ఉన్నారు. వారితో కలిసి నటించడాన్ని మరిచిపోలేను. మేం సెట్స్‌లో చాలా విషయాలు చర్చించుకునే వారం. కానీ జాన్వీతో మాత్రమే మాట్లాడా. మా ఇద్దరి మధ్య వ్యక్తిగత స్నేహం లేదు. ఇదే విషయాన్ని ఇంటర్వ్యూలో కూడా చెప్పా. అంతకుమించి ఇందులో ఎలాంటి వివాదం లేదు’ అని గుల్షన్ వివరించాడు.