India’s GDP: 8 శాతానికి చేరువలో భారత్ జీడీపీ: ఆర్ బీఐ గవర్నర్

ఈ ఆర్థిక సంవత్సరం లో భారత్ జీడీపీ 8 శాతానికి చేరువలో ఉండొచ్చని ఆర్ బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక వృద్ధి చూస్తే నాలుగో త్రైమాసికంలో మేము అంచనా వేసిన 5. 9% కంటే ఎక్కువ వృద్ధి నమోదు అవ్వచ్చని అంచనా వేస్తున్నారు.

ఫలితంగా ఈ ఏడాది జిడిపి వృద్ధిరేటు 7.6% మించి నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు. 8 శాతా నికి చేరువలో జిడిపి ఉండొచ్చని ఆర్ బీఐ గవర్నర్ పేర్కొన్నారు. కాగా గత 18 నెలల్లో భారత్ 8.4% వృద్ధిరేటును సాధిం చింది.

TAGS