India is Ready: అంతరిక్ష రంగంలో సత్తా చాటేందుకు సిద్దమైన భారత్
అంతరిక్ష రంగంలో జోరు చూపించేందుకు భారత్ సిద్దమవుతోంది. వరుస ప్రయోగాలతో సత్తా చాటేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమెషన్ అండ్ ఆథరైజేషన్ ఇన్ స్పేస్ వెల్లడించిన వివరాల ప్రకారం..రానున్న 14 నెల్లో అంటే 2023-24 నాల్గో త్రైమాసికంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత దేశం 30 అంతరిక్ష ప్రయోగాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది.
వీటిల్లో ప్రతిష్టాత్మక గగన్ యాన్ ప్రాజెక్టుకు సంబందించినవి ఏడు ప్రయోగాలు ఉన్నాయి. స్పైరూట్,అగ్నికుల్ వంటి ప్రవేట్ అంతరిక్ష అంకుర సంస్థల ప్రయోగాలూ ఏడు ఉన్నట్లు ఇన్ స్పేస్ వెల్లడించింది. ఇవన్నీఆంద్రప్రదేశ్ రాష్ట్రం శ్రీహారి కోట లోని సతీష్ దావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించేందుకు ప్రణాలికలు చేయబడ్డాయి. వీటిలో సగం భారతదేశంలోని వాణిజ్య అంతరిక్ష రంగానికి ఉపయోగపడనున్నాయి.