Tirumala: తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోవడంతో బయట వరకు క్యూ లైన్ కొనసాగుతుంది. సర్వద ర్శనా నికి 18 గంటల సమయం పడుతుంది. నిన్న మాఘ శుద్ధ పూర్ణిమ శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని టిటిడి వర్గాలు తెలిపాయి. కా గా నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ 3.74 కోట్ల గా ఉందని ఆలయ వర్గాలు తెలిపాయి.
72, 175 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. నిన్న మాఘ శుద్ద పూర్ణిమ కావడం వల్ల రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తిరుమల కు చేరకుున్నారు. ఉదయం నుంచి భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో దర్శనానికి సుమారుగా 18 గంటలకు పైగా సమయం పడుతుంది. కంపార్ట్ మెంట్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. రద్దీ కారణంగా క్యూ లైన్ల్ బయట వరకు కొనసా గుతు న్నాయి. ఈ రోజు ఆదివారం సెలవు దినం కావడం తో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి తండోపతండాలుగా తరలివచ్చారు.