తెలంగాణ: రంగారెడ్డిలో రైతు బీమా, రైతు బంధు డబ్బులు స్వాహా వ్యవహారంలో వ్యవసాయ అధికారి ని సైబరాబాద్ ఆర్థిక నేరాలు విభాగం అధికారులు అదుపులోకి తీసు కున్నారు. కొందుర్గు మండలం లో 20 మంది రైతులు మరణించినట్లు నకిలీ బీమా పత్రాలు సృష్టించి రూ.కోటి కాజేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసు విచారణలోని రైతుబంధు నిధులు రూ. కోటి కాజేశారని తేలింది. మరో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను అదుపులోకి తీసుకొని విచారించారని సమాచారం అందుతోంది.