District Collector:అర్హులై ఉంటే ఓటు కోసం ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు: కర్నూలు జిల్లా కలెక్టర్ డా.జి.సృజన

 

కర్నూలు జిల్లా: అర్హులు ఎవ రైనా ఉంటే ఓటు కోసం ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవ చ్చని జిల్లా కలెక్టర్ డా.జి.సృజ న రాజకీయ పార్టీ ప్రతినిధులకు తెలియ చేశా రు.  గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల మౌలిక సదుపాయాలకు సం బంధించిన అంశాలపై వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ల తుది జాబితా ఈ నెల 22వ తేదిన ప్రచురించడం జరిగిందని, జాబితా కు సంబంధించి వివిధ దినపత్రికల్లో వస్తున్న వ్య తిరేక వార్తల పై విచారణ చేసి తగిన చర్యలు తీసుకుం టున్నామని, అవి కాకుండా ఇంకా ఏమైనా రాజకీయ పార్టీ ల దృష్టిలో ఉంటే ఈ ఆర్వో లు లేదా తమ దృష్టికి తీసుకు రావచ్చని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచిం చారు ..ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికలు జరగ బోయే సంవత్సరంలో తుది ఓటర్ల జాబితా ప్రచురణ అయిన తరువాత సుమోటో డిలిషన్స్ చేయకూడద న్నారు . తుది ఓటర్ల ప్రచురణ జాబితాలో ఎలాంటి డిలిషన్స్ చేయాలన్న దానికి జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరి అన్నారు. అదే విధంగా తుది ఓటర్ల జాబితా ప్రచురణ అయిననప్పటి నుంచి మార్పులు, చేర్పులు, తొలగింపులపై జిల్లా ఎన్నికల అధికారి పూర్తి స్థాయి పర్యవేక్షణ ఉంటుందన్నారు.. ఇంకా ఎవరైనా అర్హులైన ఓటర్లు ఉంటే దరఖాస్తు చేయించాలని కలెక్టర్ సూచించారు.

TAGS