America: అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి పై దుండగులు దాడికి పాల్పడ్డారు. సయ్యద్ మజాహిర్ ఆలీ అనే హైదరాబాద్ కు చెందిన విద్యార్థి చికాగో లోని ఇండియన్ వెస్లీయన్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. విద్యార్థిపై నలుగురు దుండగులు విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. తల, ముక్కు, నోటిపై సయ్యద్ కు తీవ్ర గాయాలు అయ్యాయి.
దుండగుల దాడిలో తీవ్ర గాయాలైన సయ్యద్ మజాహిర్ ఆలీ తనని కాపాడాలంటూ ఇండియన్ ఎంబసీ అధికారులకు ఫోన్ చేశాడు. హైదరా బాదు లో విద్యార్థి తల్లిదండ్రులు సైతం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ దృష్టికి తీసుకెళ్లారు. తమ కుమారుడిని కాపాడాలంటూ సయ్యద్ ఆలీ కుటుంబం సభ్యులు కేంద్రమంత్రికి లేఖ రాశారు. అమెరికాలో ఇటీవల దుండగులు చచ్చిపోయి దాడులు చేస్తున్నారు.