Heavy Rain : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఉరుములు, మెరుపులతో భారీ వర్ష సూచన

Heavy Rain in Hyd
Heavy rain Alert : హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న రెండు మూడు గంటల్లో ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడనున్నట్లు చెప్పింది. కుత్బుల్లాపూర్, అల్వాల్, కంటోన్మెంట్, మల్కాజ్ గిరి, కాప్రా, ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు. ఓపెన్ నాలాలతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని, వాహనదారులు రూడ్లపై వెళ్లేటప్పుడు జాగ్రత్తా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
రానున్న 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అధిక వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. 2024, జూన్ 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు.