Hoarding : పంజాబ్ లో కూలిన భారీ హోర్డింగ్.. 5 కార్లు ధ్వంసం

Hoarding Collapsed in Punjab
Hoarding Collapsed in Punjab : పంజాబ్ లోని మొహాలి ప్రాంతంలోని జిరాక్ పూర్ లో భారీ హోర్డింగ్ కూలిపోయింది. బుధవారం (జూన్ 5) రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో స్థానిక మార్కెట్ వెలుపల పార్కింగ్ చేసి ఉన్న ఐదు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో వర్షం కురుస్తుండడంతో సమీపంలో ప్రజలు ఎవరూ లేరు. దీంతో ఎవరికీ హాని జరుగలేదు. పాడైపోయిన వాహనాల పరిస్థితి చూస్తే ప్రమాదం ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది.
ఇటీవల ముంబైలోని ఘట్కోపర్ లో కూడా భారీ హోర్డింగ్ కూలి 14 మంది మృతి చెందిరు. తుపాను కారణంగా 250 టన్నుల బరువు ఉన్న 100 అడుగుల ఎత్తయిన ఇనుప హోర్డింగ్ కూలి పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ పై పడింది. బంక్ లో పనిచేసే సిబ్బందితో పాటు మొత్తం 14 మంది స్పాట్ లో చనిపోయారు. 74 మంది గాయపడ్డారు.