JAISW News Telugu

Illandu municipality: ఇల్లందు మున్సిపాలిటిలో హైటెన్షన్…పోలీసులు లాఠీఛార్జ్

Illandu municipality:భద్రాద్రి కొత్తగూడెం జల్లా ఇల్లందు మున్సిపాలిటీల్లో పొలిటికల్ హైటెన్షన్ నెలకొంది. ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ పై నేడు అవిశ్వాసం ప్రత్యేక మీటింగ్ జరగనుంది. చైర్మన్ దుమ్మాలపాటి వెంకటేశ్వరారావుపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం కీలక మలుపు తిరుగుతోంది. కౌన్సిలర్లను కిడ్నాప్ చేసేందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు యత్నించారు.

అధికార  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు 144 సెక్షన్ వర్తించనట్లు పోలీసులు ప్రవర్తిస్తుండటం పై బీఆర్ఎస్ కార్యకర్తలు ఫైర్ అయ్యారు. ఒక సిపిఐ, ఇద్ద రూ బీఆర్ఎస్ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నం చేశారు. వారిని అడ్డుకోవడంతో రెచ్చిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎంపీడీవో కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. కార్యాలయం అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

Exit mobile version