MLA Vasantha: వచ్చే ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేస్తానని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వెల్లడించారు. కార్యకర్తలతో ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. టిడిపి, జనసేన, కాంగ్రెస్ పార్టీల నుంచి తనకు ఆహ్వానాల అధ్యయనం కృష్ణ ప్రసాద్ తెలిపారు.
ఏ పార్టీ నుంచి పోటీ చేసేది త్వరలో వెల్లడిస్తారని ఆయన తెలిపారు మంత్రి జోగి రమేష్ వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డారని అతను వెన్నుపోట్లు పోడుస్తుంటే అదే పార్టీ నుంచి ఎలా పోటీ చేస్తారని వ్యాఖ్యానించారు. మెత్తం మీద వైసిపి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పార్టీ వీడడం ఖాయమని తెలుస్తోంది. గత రెండు రోజుల నుంచి ఆయన ముఖ్య అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
టిడిపి,జనసేన,కాంగ్రెస్ పార్టీల నుంచి తనకు ఆహ్వానాలు అందాయని ఎమ్మల్యే కార్యకర్తల సమావేశం లో వెల్లడించారు. ఏపార్టీలోకి వెళ్తే మనకు గౌరవంగా ఉంటుందో ఆ పార్టీలోకి వెళితే బాగుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. నా వెంట ఉన్న కార్యకర్తల అభీష్టం మేరకే నానిర్ణయం ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.