Heroine Wedding : హడావిడి.. ఆర్భాటం లేకుండా.. హీరోయిన్ పెళ్లి..

Heroine Wedding

Heroine Wedding

Heroine Meera Nandan Wedding : చక్కటి రూపం, సంప్రదాయానికి నిలువెత్తు రూపంగా కనిపించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో  చెరగని ముద్ర వేసుకొంది హీరోయిన మీరా నందన్. తాజాగా ఈ హీరోయిన్ వివాహం చేసుకుంది. అదీ ఎలాంటి హడావిడి లేకుండా..  గుడిలో చాలా సింపుల్ గా తన వివాహ క్రతువును కానిచ్చేసింది. శనివారం ఉదయయం ఈ వేడుక జరుగగా, పలువురు  ప్రముఖులు హాజరై వధూవరులకూ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.

మీరా నందన్.. ఈపేరు అంతగా పరిచం లేకపోవచ్చు. కానీ పన్నెండేళ్ల క్రితం తెలుగు థియేటర్లలో సంచలనం సృష్టించిన జై బోలో తెలంగాణ సినిమా హీరోయిన్ అంటే మాత్రం వెంటనే  గుర్తు పట్టేస్తారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 2011లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. ఇందులో జగపతి బాబు, స్మృతి ఇరానీ, సందీప్ సింగ్ తదితరలు ప్రధాన పాత్రలు పోషించారు. మీరా నందన్ ఇందులో హీరోయిన్ గా నటించింది. అయితే ఈ మూవీ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు ఈ చిన్నది. తాజాగా ఈమె పెళ్లి చేసుకుంది. ఎలాంటి హడావిడి లేకుండా దేవాలయంలో చాలా సింపుల్  గా వివాహం చేసుకుంది.

శనివారం ఉదయం గురువాయూర్ ఆలయంలో లండన్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న శ్రీజుతో మీరా నందన్ ఏడడుగులు నడిచింది. వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతకు ముందు హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలు జరుగగా  పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. గతేడాది సెప్టెంబర్ 13న వీరికి నిశ్చితార్థం జరిగింది. మీరా, శ్రీజు ఇద్దరు ప్రముఖ మ్యాట్రిమోని ద్వారా కలుసుకున్నారని వారి సన్నిహితలుు చెబుతున్నారు.

ఇక మీరా నందన్ మలయాళంలో అనేక చిత్రాల్లో నటించారు. 1990 నవంబర్ 26న కేరళలోని కొచ్చి ప్రాంతంలో జన్మించారు. జర్నలిజం పూర్తి చేసిన మీరా నందన్ మొదట్లో కొన్ని ప్రకటనలు చేశారు. ఆ తర్వాత స్టార్ సింగర్ రియాల్టీ షోకు యాంకర్ గా చేశారు. 2007లో ముల్లా సినిమాతో సినీ ఇండస్ర్టీలోకి అడుగుపెట్టారు.  ఆ తర్వాత తమిళం, కన్నడ, తెలుగు భాషల్లో పలు సినిమాలు చేశారు. తెలుగులో చేసిన జై బోలో తెలంగాణ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించినా మీరా నందన్ కు అవకాశాలు మాత్రం రాలేదు. మీరా చివరగా ఎన్నలుమ్ ఎంటే ఆలియా అనే చిత్రంలో నటించి మెప్పించింది.

TAGS