విజయవాడ గుణదల మేరీ మాత ఆలయం శతాబ్ది సంబరాలకు సిద్ధమయ్యింది. ఈ ఆలయం ప్రతిష్టాపన జరిగి వందేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈనెల 9, 10 ,11 తేదీల్లో భారీ స్థాయిలో వేడుకలు నిర్వహించనున్నారు. లక్షలాది మంది ఈ వేడుకలకు తరలి రానుండగా ఎండ ఇబ్బంది లేకుండా పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తులు కొండపైకి వెళ్లేం దుకు బారికేడ్లతో కాలిబాటలు సిద్ధంచేశారు. ఈ క్షేత్రం ప్రధాన ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
గుణదల మేరిమాత ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. మేరిమాతను దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడకు వస్తుంటారు. ఏసు ప్రభు కు జన్మనిచ్చిన మేరి మాత ను ప్రజలు కొలుస్తారు. గుణదల మేరిమాత ఆలయం నిర్మించి వందేళ్లు అయిన సందర్బంలో వేడుకలను అద్బుతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాధి మంది భక్తులు తరలిరానున్నారు.