పెదకూరపాడు మండలం జలాల్ పురం గ్రామంలో పెదకూరపాడు నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ సమక్షంలో 42 కుటుంబాలు వైసిపిని వీడి టిడిపిలో చేరాయి. 42 కుటుంబాలకు భాష్యం ప్రవీణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ కూటమికి అనూహ్యమైన స్పందన లభిస్తోందని ఆయన తెలిపారు. వైసీపీ విధానాలు నచ్చకనే ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారని భాష్యం ప్రవీణ్ తెలిపారు.