ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. పరీక్ష నిర్వ హణపై నిన్న విద్యాశాఖ అధికారులతో సమావేశమైన మంత్రి మూలంకషంగా చర్చించారు. త్వరితగతిన నియామక ప్రక్రియ పూర్తిచేసేలా ఏర్పాటులు చేస్తున్నారు. 6,100 టీచర్ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల కానుంది. వయోపరిమితి పెంచాలని డిమాండ్ పై ఏమైనా ప్రకటన ఉంటుందేమో చూడాల్సి ఉంది. జాబ్స్ ఇవ్వడం లేదని ఆరోపనలు వస్తున్న నేపద్యంలో ఏపి ప్రభుత్వం ఇప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. గడిచిన ఐదు సంవత్సరాలలో ఎలాంటి నోటిఫికేషన్ లు ఇవ్వకుండా ఎన్నికల వచ్చే సమీపిస్తున్న తరుణంలో వైసిపి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తుందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.