Good news: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.
AP: ఇంటర్ పరీక్షల హాల్ టికెట్ లపై ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఇదివరకు కాలేజీ ఫీజుల కోసం హాల్ టికెట్లు ఇవ్వకుండా యాజమాన్యాలు వేధించేవి. తాజా నిర్ణయంతో విద్యార్థులు నేరుగా సైట్ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అధికారులు తెలిపారు.
హాల్ టికెట్ పై ఫోటో ప్రింట్ కాకపోతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో తో కాలేజీలను సంప్రదిస్తే స్కాన్ చేసి ఫోటోతో కూడిన హాల్ టికెట్ ఇ స్తారని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. గతంలో విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వాలంటే ప్రిన్సిపల్ సంతకం తప్పని సరిగా ఉండేది. ఫీజులు చెల్లించని కారణంగా హాల్ టికెట్లు జారీ విషయంలో నిర్లక్ష్యం జరిగేది. అలాంటి పరి స్థితులు ఇకమీదట విద్యార్థుల కు ఉండకూడదని ఇంటర్ బోర్డు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.