Sugar Factories: చక్కెర కర్మాగారాలపై సమగ్ర నివేదిక ఇవ్వండి..సిఎం రేవంత్ రెడ్డి
Sugar Factories: తెలంగాణ రాష్ట్రంలో మూతపడ్డ నిజాం చక్కెర కర్మాగారాల పునరుధ్దరణకు వీలైనంత తోందరగా సమగ్ర నివేదికను అందిం చాల ని కేబినెట్ సబ్ కమిటీని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బోధన్ ,ముత్యం పేట ముతపడ్డ ఫ్యాక్టరీలకు సంబంధించిన పాత బకాయిలు ,ఆర్థిక ఇ బ్బందులపై మీటింగ్ లో చర్చించారు.
మూత పడ్డ వాటిని తెరిపించేందుకు ఏమేం చేయాలనే దానిపై ప్రధానం గా చర్చ జరిగింది. ఈ అంశంపై కేబినెట్ సబ్ కమిటితో పాటు అధికారులతో సమాలోచనలు చేసి నిర్ణీత గడువు లోపెట్టుకోని నివేధిక ఇవ్వాలని సిఎం ఆదేశించారు.
అధికారంలో కి రాగానే మూత పడిన ఫ్యాక్టరీను తెరచి ఉపాధి కల్పిస్తామని ఎన్నికల ముందు సిఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇచ్చిన హామి ని నిలబెట్టుకోనేదంకు సిఎం కేబినెట్ సబ్ కమిటీతో ప్రత్యేక సమావేశం నిర్వహించడమే కాకండా ఫ్యాక్టరీలను తెరిచేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశాలపై చర్చించి త్వరగా నివేధిక ఇవ్వాలని ఆదేశించారు.