JAISW News Telugu

Free Current: 27 నుంచి ఫ్రీ కరెంట్ రూ.500 కి సిలిండర్…డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క

తెలంగాణ: ఈనెల 27 నుంచి మరో రెండు గ్యారెంటీలను అమలు చేయనున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ తో పాటు  రూ. 500 కే గ్యాస్ సిలిండర్ పథకాలను చేవెళ్లలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ప్రారంభిస్తారని డిప్యూటీ సీఎం తెలిపారు.

డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలను త్వరలోనే అందిస్తామని ఆయన తెలిపారు. గిరిజనులకు పోడు పట్టాలు అందించేందుకు చర్యలు తీ సుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేసిన కాంగ్రస్ సర్కార్ మరో రెండు ముఖ్యమైన హామీలను అమలు చేసేందుకు రంగం సిద్దం చేసుకుంది.

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ఈ రెండు ముఖ్యమైన పథకాలను ప్రారంబించేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. మెత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇఛ్చిన హామీలను నెరవేరుస్తుంది.

Exit mobile version